అమరావతి : పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్(2024)లో భారత్ షూటర్లు పతకాలు సాధించడం గర్వకారణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. షూటర్లు మను బాకర్(Manu Bakar) సింగిల్ విభాగంలో పతకాన్ని సాధించి భారత్ గౌరవాన్ని పెంచిందని ప్రశంసించారు. డబుల్స్‌లో మను బాకర్, సరబ్జోత్ (Sarabjot) జోడీ మరో కాంస్యాన్ని సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను రికార్డు సృష్టించారని అన్నారు.
మనూ భాకర్ స్టన్నింగ్ షో.. ఇండియాకు మరో మెడల్
పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో రెండో మెడల్ కొట్టింది ఇండియా. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. షూటర్ మనూ భాకర్ ఖాతాలో మరో మెడల్ పడింది. మిక్స్డ్ టీమ్‌లో మనూ భాకర్‌తో పాటు సరబ్జోత్ సింగ్ ఉన్నారు.
కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్‌తో షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మనూ భాకర్ నిలిచారు. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ జోడి కొరియాపై 16-10 పాయింట్ల తేడాతో విజయం సాధించారు.