Pawan Kalyan | నష్టాలు రాని పరిశ్రమ వైసీపీ రాజకీయ పరిశ్రమే.. పవన్‌కల్యాణ్
Pawan Kalyan | నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిశ్రమ అని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan | నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీ రాజకీయ పరిశ్రమ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆదివారం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడతూ అన్ని పరిశ్రమలకు ఉన్నట్లే విశాఖ స్టీల్‌కు కూడా నష్టాలు ఉన్నాయని, వస్తాయని చెప్పారు. సొంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్‌కు నష్టాలు తగ్గుతాయని అన్నారు.
విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడగరని పవన్ కల్యాణ్ నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్లేది కబుర్లు చెప్పుకోవడానికా, కాఫీలు తాగడానికా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కావాలని 25 మంది ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారని అడిగారు. తనకు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే బలం కూడా లేదు, గెలిచిన ఒక్క ఎమ్మెల్యేనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు పట్టుకుపోయారు.
కానీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి విజ్ఞప్తి చేశామని పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉందని అమిత్‌షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ప్రజా బలం ఉన్నందునే అపాయింట్మెంట్ లభించిందని చెప్పారు.
ఉక్కు సంకల్పంతో విశాఖ స్టీల్‌ను కాపాడుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నారు. కేంద్రానికి మన కష్టాలు ఎవరు చెబుతారు.. మన నాయకులే కేంద్రానికి మన కష్టాలు చెప్పుకోవాలన్నారు. విశాఖ ఉక్కు కార్మికుల పక్షాన తాను పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR: ఆర్ఆర్ఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడో తెలుసా?
RRR సినిమాను కావాలనే తక్కువ రేట్లకు అమ్ముతున్నారా..?
పవన్ కళ్యాణ్‌ను ఫస్ట్ టైం పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో తెలుసా !
Pawan: పవన్ సినిమాతో అకీరా నందన్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడా..!
power star pawan kalyan | మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ దేవరకొండనే.. దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

