Padmavati Temple | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నె 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు 15ప సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. ఆలయంలో భక్తులతో, సిబ్బంది వల్ల తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న పవిత్ర ప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750 టికెట్‌ను కొనుగోలు చేసి భక్తులు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు రెండు లడ్డూలు, రెండు వడలు బహుమతిగా అందించనున్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 10న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. 15న అంకురార్పణ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, 16న అష్టదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేశారు. అలాగే, 16 నుంచి 18 వరకు కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది.