వచ్చే నెల 5 నుంచి జమ్మలమడుగు నారాపుర ఆలయంలో ప్రవిత్రోత్సవాలు
జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెల 5 నుంచి పవిత్రోత్సవాలను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ...
తిరుపతి : జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో వచ్చే నెల 5 నుంచి పవిత్రోత్సవాలను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు సమీక్షించారు. విశేష సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 4 వ తేదీ సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు. సెప్టెంబరు 5న చతుష్టార్చాన, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 7న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగుతాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

