అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో (Paritala Ravi ) నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. నిందితులకు శిక్ష పడి 18 ఏళ్లుగా కడప సెంట్రల్ జైలులో ( Kadapa Central Jail) ఉన్నారు. నిందితులు హైకోర్టులో (High Court) పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై జరిగిన విచారణ అనంతరం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో నిందితులైన పండు నారాయణ రెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు వడ్డే కొండ, ఓబిరెడ్డి జైలు నుంచి విడుదలయిన వారిలో ఉన్నారు. వీరంతా ప్రతి సోమవారం సంబంధిత పోలీస్స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.25వేల రెండు పూచీకత్తులు ఇవ్వాలని, జైలు నుంచి విడుదలయ్యాక సత్ప్రవర్తన సరిగా లేకపోతే వచ్చే ఫిర్యాదు మేరకు బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా అతడిపై దాడిచేసి చంపివేశారు.