హైదరాబాద్: పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పోచవరంలో నేడు పాపికొండల విహార యాత్రను ప్రారంభించనున్నారు. పరిమిత సంఖ్యలో బోట్లతో భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం మండలం పోచవరంలో విహారయాత్ర ప్రారంభకానుంది.
రెండేండ్ల క్రితం కట్టలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన తర్వాత పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇటీవలే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విహారయాత్రకు అనుమతించాయి. అయితే ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు పరిశీలించాకే అధికారులు యాత్రకు పరిమిషన్ ఇవ్వనున్నారు.