సొంత పార్టీ వారే నాపై కుట్ర చేస్తున్నారు: బాలినేని
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వారే కుట్రకు తెరలేపారని సీఎం జగన్ బంధువైన బాలినేని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలే కొందరు తనను టార్గెట్ చేశారని, వారు ఎవరో..
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వారే కుట్రకు తెరలేపారని సీఎం జగన్ బంధువైన బాలినేని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలే కొందరు తనను టార్గెట్ చేశారని, వారు ఎవరో, వారేం చేస్తున్నారో తనకన్నీ తెలుసునన్నారు. త్వరలోనే వారి సంగతి తేలుస్తానని హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. మద్యం సేవించి జనసేన నాయకురాలికి ఫోన్ చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారితో తన వారు టచ్లో ఉన్నారని, తనకు సంబంధం లేని విషయాలను అంటగట్టి అసత్యప్రచారం చేస్తున్నారని అన్నారు. సమయం వచ్చినప్పుడు వివరాలు వెల్లడి చేస్తానని తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ మేరకే కేసులు ఉపసంహరించుకున్నట్లు బాలినేని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ కూడా నిజానిజాలు తెలుసుకుని స్పందిస్తే గౌరవంగా ఉంటుందన్నారు. తన కుమారిడిపై కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి ఛాలేంజ్ విసిరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

