తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొవిడ్ 19 నిబంధనల ప్రకారం ఏకాంతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై దర్శనమిచ్చారు. పూర్వం క్రూరభూతాల ప్రజలు పడుతున్న బాధల నుంచి కాపాడాలని బ్రహ్మదేవుడు శివున్ని వేడుకున్న మేరకు ‘‘భూతపతి”గా అవతరించి బాధలను తొలగించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చాడని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రెడ్డిశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.