తిరుమల : మాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1న తిరుమలలో గరుడసేవను (Garuda Seva ) నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. ఆరోజు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామి గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు .
కాగా తిరుమలలో నిన్న 69,254 మంది భక్తులు దర్శించుకోగా 20,954 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.35 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అన్నారు.