అమరావతి : నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం బ్యారేజ్(Sangam Barrage) , నెల్లూరు బ్యారేజ్(Nellore Barrage) లకు ఇదివరకు ఉన్న పేర్లను పునరుద్దరించాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Former minister Kakani) డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగం బ్యారేజ్‌కు మంత్రిగా ఉంటూ మరణించిన గౌతమ్ రెడ్డి (Gowtam reddy) పేరును, నెల్లూరు బ్యారేజ్‌కు మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరును ఎందుకు తొలగించారని నిలదీశారు .
పాత పేర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వైసీపీ హయాంలో కొనసాగిన పథకాల పేర్లను తొలగిస్తున్నారే తప్పా కొత్తవి ఏమీ చేపట్టడం లేదని ఆరోపించారు. 14 సంవత్సలరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేనది అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు వాటి విస్తరణ పనులు చేపట్టి రైతాంగానికి నీరందించారని తెలిపారు.
సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను వైసీపీ పూర్తి చేసిందన్నారు. ప్రచార ఆర్భాటాలే తప్ప చంద్రబాబు పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా సోమశిల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.