విశాఖతీరంలో అధికారుల అలర్ట్.. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

అమరావతి : విశాఖ తీరంలో రింగు వలల వివాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో ఇరువర్గాలు 6 బోట్లను ధ్వంసం చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే . ఇరువర్గాల మధ్య వివాదం మరింత పెరగకముందే పోలీసులు, అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొదని హెచ్చరికలు జారీ చేశారు.
గాజువాక మండలం అప్పికొండ నుంచి భీమిలి మండలం అన్నవరం వరకు ఉన్న సుమారు 40 కిలోమీటర్ల తీర ప్రాంతంలో చేపల వేటను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. వాసవివడ పాలెం తీరప్రాంతంలో పోలీసులు పికెటింగ్ను ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు గ్రామాలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు. ఓ వర్గానికి చెందిన మత్స్యకారులు రింగువలలతో వేటకు వెళ్లడడంతో మరో వర్గం అడ్డుకోవడంతో వివాదం మొదలైంది . తమ బోట్లకు నిప్పుపెట్టారని తమ పిల్లలను ఓ వర్గం అపహరించిందని మరో వర్గానికి చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. వలలను కోసేశారని తమ వర్గానికి చెందిన వారిని కొట్టారని మరో వర్గం ఆరోపిస్తుంది.
అసలు రింగువలల వివాదానికి కారణమైన వాసవాడ పాలెం మండలం పెద్దజాలరిపేట గ్రామానికి చెందిన వారు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తీరంలోకి వచ్చిన మత్స్యకారులు ఇళ్లలోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అతిపెద్దది గా ఫిషరీస్ హర్బర్గా ఉన్న ఈ ప్రాంతంలో వివాదాల కారణంగా సుమారు 2వేల వరకు బోట్లు తీరానికి పరిమితమయ్యాయి . ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్పై హరీశ్రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

