హైదరాబాద్: గత 30 ఏండ్లుగా ఈ దుర్మార్గులు తనను వేధిస్తున్నారని దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi) అన్నారు. తన పై మీకు ఎందుకు కక్ష ఎందుకని, తానే తప్పు చేశానని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారని, భార్యగా ఇంటికి తీసుకొచ్చారని చెప్పారు. ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశానని, చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన తనను వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. ఇప్పటికీ నా జీవితాన్ని నాశనం చేయడానికి కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘29 ఏండ్లుగా ఎన్టీఆర్‌కు దూరమై మనోవేదనకు గురవుతున్నా. నా ఫోన్ నంబర్‌ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా వెయ్యికిపైగా బెదింపు కాల్స్ వస్తున్నాయి. మీరు అనుకున్నా.. అనుకోకున్నా నేను మీ అత్తగారిని కాదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుందే మీరు చూస్తూ ఉంటారా?. మీకు బాధ్యత లేదా?.
ఇన్నేండ్లు డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడుగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బతుకుతున్నా. నాపై కక్ష ఎందుకు, నేనేం తప్పు చేశా. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షల కోట్లు సంపాదించారు. అలాగే పెద్దాయన్ను సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా’ అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు
లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు.. భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు
ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశా.. చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు
ఇప్పటికీ నా జీవితాన్ని నాశనం చేయడానికి… pic.twitter.com/uRYInUOmmL
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2025