అమరావతి : ఎన్టీఆర్ (NTR District) జిల్లా బోదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ(Cement Factory)లో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ( Boiler explode) 20 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగ్రాతులు బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట , విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.