Bus Tickets on Google Maps | ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై ఆర్టీసీ యాప్ లేదా వెబ్సైట్లోనే కాకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ మాత్రమే కాదు.. మీరు వెళ్లాలనుకునే రూట్లో గమ్యస్థానానికి చేరుకునేందుకు బస్సులు ఎప్పుడెప్పుడు ఉన్నాయి? ఏ బస్సు ఎక్కితే ఎంత సమయంలో వెళ్లవచ్చనే తదితర వివరాలను కూడా చూసుకోవచ్చు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ కొత్త సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానం కూడా అయ్యింది.
సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే రూట్ మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో వెతుకుతుంటాం. అప్పుడు కాలినడక, మోటర్ సైకిల్, బస్సు, ట్రైన్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటే, దాని ప్రకారం ఎంత సమయంలో వెళ్లవచ్చు? ఏ రూట్లో వెళ్తే తక్కువ టైమ్‌లో గమ్యస్థానాలకు చేరవచ్చనే అన్ని వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అనుసంధానం కారణంగా.. మనం ఏదైనా రూట్ సెర్చ్ చేసినప్పుడు బస్సు ఆప్షన్ కూడా చూపిస్తుంది. బస్సు ఆప్షన్ ఎంచుకున్నప్పుడు మనం వెళ్లాల్సిన రూట్లో ఏ సమయంలో బస్సు ఉందనే వివరాలను చూపిస్తుంది. ఏ బస్సు ఎక్కితే ఎంత సమయంలో గమ్యస్థానాలకు వెళ్లవచ్చనే వివరాలను చూపిస్తుంది. అలాగే బుక్ టికెట్ అనే సదుపాయం కూడా ఉంటుంది.
బుకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే.. నేరుగా అది ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ప్రయాణికులు తమ వివరాలను ఎంటర్ చేసి, ఆన్లైన్లో ఈజీగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని ఇప్పటికే విజయవాడ – హైదరాబాద్ రూట్లో ప్రయోగాత్మకంగా పరిశీక్షించారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మ్యాప్స్‌లో