Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మతాన్ని అడ్డం పెట్టుకుని జనాలను రెచ్చగొడుతున్నారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన సీనియర్ నాయకులు, మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. అతను మత ఛాందసవాది కాదు.. హిందూమతాన్ని గౌరవించాలి, హిందూ ఆచారాలను రక్షించాలని పాటుపడేవాడని స్పష్టం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు.. క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రేమిస్తారని చెప్పారు.
నీ మతంతో పాటు సాటి మతాలను గౌరవించు, రక్షించు అని సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మమని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ఆ ధర్మాన్నే పవన్ కళ్యాణ్ పాటిస్తాడని తెలిపారు. ఉధృత స్థాయిలో సమాజం జరుగుతున్న సమయంలో కూడా మసీదు నుంచి ఆజాన్ వస్తే తన స్పీచ్‌ను ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడని చెప్పారు. అది పరమతానికి పవన్ కల్యాణ్ ఇచ్చే గౌరవం, మర్యాద అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రేమిస్తారని నాగబాబు అన్నారు. అతను మతఛాందస్స వాది కాదు హిందు మతాన్ని గౌరవించాలి, హిందూ ఆచారాలను రక్షించాలని పాటుపడేవాడని పేర్కొన్నారు. హిందూ మత ధర్మ పరిరక్షణలో ఆయన పోరాటం క్రైస్తవుల మీద, ముస్లింల మీద కాదని స్పష్టం చేశారు. హిందూ ధర్మంలో ఉంటూ హిందు ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్వాదులమని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులను చెంపపెట్టి కొట్టడానికి, హిందూ మతం పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న కొంతమందిని తిరిగి గౌరవించరా నీ సనాతన ధర్మాన్ని అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.
పవన్ కల్యాణ్ పరిపాలనలో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుందని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్ కి ఏ ముస్లింకి బాధ కలిగించవని వ్యాఖ్యానించారు.