అమరావతి : రానున్న రోజుల్లో వైసీపీ( YCP ) గొడ్డలి పార్టీకి ఏ మాత్రం భవిష్యత్ లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu) పేర్కొన్నారు. వైసీపీ పాలనలో విధ్వంసంతో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని ఆరోపించారు. కూటమి రెండేళ్ల విజయోత్సం సందర్భంగా తిరుపతి( Tirupati ) లో శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రం విభజన వల్ల కొంత నష్టపోతే, వైసీపీ పాలనలో మరింతగా నష్టపోయామని వెల్లడించారు. విధ్వంస పాలన వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపి వేధించారని, ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా 53 రోజుల పాటు తనను జైలులో ఉంచారని తెలిపారు.
పవన్‌కల్యాణ్‌ను అడుగడుగునా అడ్డుకొని వేధించారని తెలిపారు. చీకటి పాలనకు చరమ గీతం పాడాలనే కూటమిగా ఏర్పడ్డామని, విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలు కాపాడు కున్నారని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారంటే కూటమి చలవేనని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరణ కాకుండా ఆపగలిగామని అన్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి 9 మంద ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.