అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాలు కూడా వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆనందంగా లేరని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మహిళలపై అనేక దౌర్జన్యాలు, హత్యలు, లైంగిక దాడులు జరిగాయని ఆరోపించారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు.
రాష్ట్రంలో మహిళలు అభద్రతా భావంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషధమంటూనే..పెద్దఎత్తున దుకాణాలు తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.