ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. ఈ మేరకు...
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం అధికారులతో సమీక్షించిన సీఎం జగన్.. ఈ మేరకు నైట్ కర్ఫ్యూ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్నది. కాగా, ఇప్పుడిప్పుడే కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
అయితే, రాష్ట్ర ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం తెలిపింది. ఫీవర్ సర్వేను కూడా కొనసాగించాలని జగన్ అధికారులను ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు.
గత 24 గంటల్లో ఐదు వందలకు దిగువన కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుండటంతో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను కంటిన్యూ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా దవాఖానల్లో ఉండేలా చూడాలన్నారు. పరిపాలనా బాధ్యతలను నిపుణులైన వారికి అప్పగించాలని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

