NIA : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో కలకలం రేపిన ఐసిస్ ఉగ్రకుట్ర కేసులో మరొకరిని ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాది సిరాజ్‌తో సంబంధం ఉన్న బిహార్‌కు చెందిన ఆరిఫ్ అలియాస్ తాలిబ్‌ను కస్టడీకి తీసుకున్నారు. ఢిల్లీలోని విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. పారిపోయేందుకు యత్నించగా చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు.
సిరాజ్ వద్ద, తాలిబ్ వద్ద పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే సామగ్రి ఉన్నట్టు తెలిపారు. అక్రమంగా ఆయుధాల సరఫరాకు తాలిబ్ ప్రయత్నించాడని చెప్పారు. అతడిని విశాఖపట్టణంలోని కోర్టులో హాజరు పరుస్తామని ఎన్ఐఏ బృందం వెల్లడించింది.