Godavari | వారం రోజుల క్రితమే అతడికి ఘనంగా పెళ్లి చేశారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ సదరు నవ వరుడు గోదావరిలో(Godavari River) దూకి గల్లంతయ్యాడు. ఈ విషాదకరస సంఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిబాబు తనయుడు దేవ వికాస్‌కు ఈనెల 2న వివాహం చేశారు.
అయితే వికాస్ దిండి-చించినాడ విశిష్ఠ వారధి పైనుంచి బుధవారం గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. అతడి మానసిక పరిస్థితి సరిగాలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మోహన్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.