హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తిరుమల వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి దర్శనమిచ్చారు.
తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తలకు అభయమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుడి వాహన సేవ కన్నులపండువగా జరిగింది. సాయంత్రం శ్రీవారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. సోమవారం శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు.