శ్రీశైలం : నంద్యాల జిల్లా శ్రీశైలం గ్రామంలో నాటు సారా ( Natusara )విక్రయిస్తున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు నల్లబోతుల నాగేంద్ర, పిక్కిలి రాజేశ్వరి, నల్లబోతుల రవణమ్మ, నల్లబోతుల లక్ష్మి శ్రీశైలం(Srisailam) గ్రామం వాసవి సత్రం వద్దకు వచ్చారని సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న13 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గురువయ్య, రఘునాథుడు, బాలకృష్ణ, మహేష్, శంకర్, అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.