Nara Rohit | నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నారా రోహిత్ స్పందించారు. తాను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని ఆయన గుర్తుచేశారు. సరైన సమయంలోనే రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు.
నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సుందరకాండ టీమ్ ఇవాళ తిరుపతిలో పర్యటించింది. ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై మీడియా అడిగిన ప్రశ్నకు నారా రోహిత్ సమాధానమిచ్చారు. సరైన సమయంలో తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని బదులిచ్చారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఏపీలో ఉద్యోగ అవకాశాలు రావాల్సి ఉందని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ పై వచ్చిన ఆడియో సంబంధించి నాకు పూర్తిగా తెలియదు
త్వరలోనే నందమూరి మోక్షజ్ఞ నటించబోతున్నాడు..
రాజకీయ కుటుంబం నుంచి వచ్చా… అవసరం అయిన సమయంలో రాజకీయ ప్రవేశం చేస్తా.. – నారా రోహిత్ #NaraRohit #SundarakandaOnAug27th #JrNTR #RTV pic.twitter.com/wxVMFgx6fS
— RTV (@RTVnewsnetwork) August 24, 2025
జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపైనా నారా రోహిత్‌ను మీడియా ప్రశ్నించగా.. దాన్ని దాటవేశారు. ఎన్టీఆర్ ఆడియో లీక్ వ్యవహారం గురించి నాకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఇక సుందరకాండ సినిమా గురించి నారా రోహిత్ చెబుతూ.. ఈ సినిమాలో లవర్ బాయ్‌గా నటించానని తెలిపారు. ఈ సినిమాతో హీరోయిన్ శ్రీదేవి రీఎంట్రీ ఇస్తుందని.. ఆమె నటన అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.