Pawan Kalyan | వైరల్ ఫీవర్తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొందరగా కోలుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రార్థించారు. అనారోగ్యం నుంచి ఆయన తొందరగా తేరుకుని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్టు పెట్టారు.
‘ మన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొందరగా కోలుకోవాలి. ఆయన తొందరగా తేరుకుని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఏపీకి ఆయన అందించే సేవలతో మనందరికీ స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నా. ఓజీ సినిమా సాధించిన అద్భుత విజయాన్ని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా.’ అని ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా తెలిపింది. గత నాలుగు రోజులుగా ఆయన వైద్యం చేయించుకుంటున్నారని పేర్కొంది. అయినప్పటికీ జ్వరం తీవ్రత తగ్గలేదని, దగ్గు కూడా ఎక్కువ కావడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని తెలిపింది.