Nara Lokesh | జగన్ మూర్ఖ, దరిద్రపుగొట్టు పాలనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సహకాలు అందలేదని జపాన్ కంపెనీ తెలిపిందని ఆయన పేర్కొన్నారు. అంటే కంపెనీలకు ఇవ్వాల్సిన ప్రోత్సహకాలను జగన్ దోచేశారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో జపాన్ కంపెనీల అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన ఆక్రమణలు, కబ్జాలతో భూవివాదాలు విపరీతం అయ్యాయని నారా లోకేశ్ ఆరోపించారు. తాను నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు అతి ఎక్కువ వినతులు భూ సమస్యలపైనే వస్తున్నాయని అన్నారు. భూ వివాదాల సమస్యలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలిచ్చానని తెలిపారు.
ఉండవల్లి నివాసంలో 28వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి వినతులు అందించారని నారా లోకేశ్ తెలిపారు. అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు రూ.28వేల విరాళాన్ని అందించారని తెలిపారు. వారికి కృతజ్ఞతలు చెప్పారు.