అమరావతి : సినీనటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు (Nagababu ) ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. ఏపీలో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా (MLC Candidate) జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాగబాబు పేరును ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రులు నారా లోకేష్(Nara Lokesh), నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) , విష్ణుకుమార్‌రాజు బలపరిచి నామినేషన్ పత్రంపై సంతకం చేశారు. నామినేషన్ పత్రాన్ని నాగబాబు రిటర్నింగ్ అధికారి వనితారాణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులున్నారు.