Chandrababu Naidu | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ఆయన నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన తన క్యాబినెట్ జాబితాను మంగళవారం గవర్నర్కు అందజేయనున్నారు. మంత్రిమండలి కూర్పుపై అంతటా ఆసక్తి నెలకొన్నది. టీడీపీతోపాటు కూటమిలోని జనసేన, బీజేపీకి ఇచ్చే మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొన్నది.