తిరుమల : తిరుమల( Tirumala) శ్రీవారికి మైసూరు రాజమాత (Mysore Rajamata) ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను (Akhandas ) సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా రాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషమని తెలిపారు. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుందని వివరించారు. ఈ కార్యక్రమాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.