హైదరాబాద్ జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ టెండర్లలో న్యాయ సమీక్షకు పరిమిత అవకాశాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంచేసింది. పీవీసీ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్‌కార్డుల సేకరణ టెండర్లలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవని తేల్చింది. రేషన్‌కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్‌కార్డులను అందించేందుకు పౌరసరఫరాలశాఖ టెండర్ల నుంచి తమను అనర్హులను చేయడాన్ని సవాలు చేస్తూ రోస్మెర్టా టెక్నాలజీస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారించారు. న్యాయమూర్తి, అధికారులు పిటిషనర్‌కు సమయం ఇచ్చారని, ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం కాదని తేల్చుతూ పిటిషన్‌ను కొట్టి వేసింది.