తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో శ్రీముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.20 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. 2021 నుంచి ఇలా అలంకరిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలిస్తున్నారు.
ఇక విజయవాడ కనకదుర్గమ్మ వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా.. శుక్రవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరక్ష్మి వ్రతం వేడుకగా ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.