Murder | ఆస్తి తగాదాలతో తండ్రిని దారుణంగా చంపిన తనయుడు
Murder | ఏపీలోని కృష్ణా జిల్లా నాగలంక మండలంలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన తండ్రిని ఆస్తి కోసం కుమారుడు దారుణంగా హత్య (Murder) చేశాడు.
అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లా నాగలంక మండలంలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన తండ్రిని ఆస్తి కోసం కుమారుడు దారుణంగా హత్య (Murder) చేశాడు. వివరాలు.. మండలంలోని భావదేవర పల్లిలో కూలి చేసి బతుకుతున్న బండి హరి మోహన్రావు భార్య కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయింది. దీంతో అతడు కుమారుడు పవన్ కల్యాణ్ వద్ద ఉంటున్నాడు. అయితే ఆస్తి కోసం తండి, కొడుకు మధ్య కొన్ని రోజులుగా వాగ్వాదం జరుగుతుంది.
శుక్రవారం రాత్రి మంచం మీద పడుకున్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాంపై డిజీల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

