అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ సెకండ్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఎల్లుండి జరుగనున్నాయి. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎంపీటీసీలకు ఎస్ఈసీ సమాచారం ఇచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు మండల పరిషత్లో రెండో వైస్ చైర్మన్ పదవిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది. ఇప్పటికే గుంటూరు జిల్లా మినహా మొత్తం 649 నియోజకవర్గాల్లో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికలు పూర్తయ్యాయి.
ప్రభుత్వ చట్ట సవరణ నేపథ్యంలో 649 నియోజకవర్గాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 4 వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని చోట్లా మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మరోవైపు, విశాఖపట్నం జిల్లా మాకవరం ఎంపీపీకి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి కూడా అదే రోజు ఎన్నిక జరగనున్నది. చిత్తూరు జిల్లా రామకుప్పం, గుర్రంకొండలో అధ్యక్ష పదవికి, కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో తొలి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా మంగళవారం నిర్వహించనున్నారు.
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..