ఏపీ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపించాలంటూ మోదీకి లేఖ రాసిన రఘురామ
ఏపీలోని కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని, సీబీఐ ఆర్థిక నేర విభాగంతో లేదా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్తో విచారణ జరిపించాలని రఘురామ ఆ లేఖలో ప్రధానిని కోరారు. వివిధ అవసరాల నిమిత్తం ఏపీ ప్రభుత్వం అప్పులు తీసుకుందని, ఈ సమయంలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. బ్యాంకులు, వివిధ కార్పొరేషన్ల నుంచి జగన్ సర్కార్ ఎలా సేకరించిందో అన్న విచారణ కూడా జరపాలని నర్సాపురం ఎంపీ రఘురామ ఆ లేఖలో ప్రధాని మోదీని కోరారు.
సంచలనం రేపుతున్న కాగ్ నివేదిక
ఏపీ ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఓ నివేదిక ప్రకటించింది. కోడ్‌కు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చెల్లింపులు చేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా 48 వేల కోట్లకు సంబంధించిన రికార్డులు కూడా సరిగ్గా లేవని ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష కోట్ల రూపాయలకు పైగా అసెంబ్లీకి చెప్పకుండానే ఖర్చు చేశారని కూడా పేర్కొంది. చట్ట సభలకు చెప్పకుండా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడమంటే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కాగ్ మండిపడింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

