అమరావతి : నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత జగన్‌పై మండిపడ్డారు. వైసీపీ ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆయన ఆరోపించారు. పార్టీ నుంచి వైసీపీ అధినేత జగన్ తనను బహిష్కరించారో.? లేదో స్పష్టతలేదని, ఎవకైనా తెలిస్తే చెప్పాలని అన్నారు. తనపై అనర్హత వేటు వేయడం కుదరదని, తాను ఏ పార్టీతో చేరలేదని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటు వేయాలని ఇటీవల ఓ వైసీపీ ఎంపీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఎన్నికల హామీ మేరకు వైఎస్ఆర్ పెళ్లి కానుక, షాదీ ముబారక్ హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ శనివారం ఆయన సీఎం జగన్‌కు లేఖ సైతం రాశారు. ఈ లేఖను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.
My letter to our Hon’ble CM Shri @ysjagan garu requesting to kindly fulfill the election promise of YSR Pellikanuka and Shaadi Mubarak. @AndhraPradeshCM pic.twitter.com/15h7syeQzX
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 12, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.