అమరావతి : ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ( Home Minister Anita ) సోమవారం తిరుమలను దర్శించుకున్నారు. ఉదయం ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుపతిలోని స్పెషల్ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ( Fast-Track Courts ) ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖైదీల్లో పరివర్తన కోసం జైల్ సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. జైలు నుంచి పెరోల్‌పై వచ్చే వారిపై కూడా నిఘా ఉంచుతున్నామన్నారు. జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపట్టి , ఖైదీల భద్రత , ఖైదీల్లో పరివర్తన తీసుకొస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా జైలు, పోలీసు, అగ్నిమాపక శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.