Nandamuri Balakrishna | వైసీపీ నాయకులకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికొస్తే.. చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు. హిందూపురంలో కొందరు వెధవలు బాలయ్య గురించి మాట్లాడారని.. అందుకే ఆవేశంలో వైసీపీ కార్యాలయంపై మావాళ్లు దాడి చేశారని తెలిపారు. అదే బాలయ్య జొలికొస్తే చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు. మీకు, మీ అధినేతకు కూడా ఇదే వార్నింగ్ అని చెప్పుకొచ్చారు.
నిన్న హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూపురంలోని వైసీసీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు దాడికి దిగారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీనిపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు 300 మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని.. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు అరగంట పాటు రాలేదని ఆరోపించారు.
బాలకృష్ణ హిందూపురానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటారని ఆరోపించినందుకే దాడి చేస్తారా మండిపడ్డారు. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారని.. ప్రశ్నించేవారిపై దాడి చేస్తే ఎవరూ భయపడరని తెలిపారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలని అన్నారు.