MLA Koneti Adimulam | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మె ల్యే కోనేటి ఆదిమూలం రాసలీల లు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పని చేసే మహిళా కార్యకర్త ఫోన్ నంబర్ తీసుకుని అర్ధరాత్రి ఫోన్లు, మెసేజ్‌లతో బెదిరించినట్టు బాధితురాలు హైదరాబాద్‌లో గురువారం మీడియా సమావేశంలో వెల్లడించింది. తిరుపతిలో హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టు చెప్పింది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్టు ఆరోపించింది.
మూడుసార్లు లైంగిక దాడి జరుపడంతో పెన్ కెమెరా వినియోగించి వీడియో విడుదల చేసినట్టు చెప్పింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగికదాడి ఆరోపణలు రావడంతో టీడీపీ అధిష్ఠానం వెంటనే స్పందించింది. బాధితురాలు మీడియా సమావేశం పెట్టిన కొన్ని గంటల్లోనే ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెం డ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు నిర్ణయం తీసుకున్నారు.
చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో 2014లో కోనేటి ఆదిమూలం వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలాన్ని 2024లో వైసీపీ అధిష్ఠానం తిరుపతి నుంచి పోటీ చేయాలని సూచించగా ఆయన అంగీకరించలేదు. దీంతో వైసీపీకి రాజీనామా చేసి సత్యవేడు నుంచి ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలుపొందారు.