తిరుమల : దేశంలోని పీఠాధి (Peethadhi) , మఠాధిపతులు, స్వామీజీల సూచనలు, సలహాల ఆధారంగా టీటీడీ ధార్మక ప్రచారం చేస్తుందని తిరుమల(Tirumala ) పెద్దజీయర్ స్వామి (Peddajeyar Swami ) అన్నారు. తిరుమలలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర ధార్మిక సదస్సు (Darmika Sadassu) ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి చెంత ధార్మిక సదస్సు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రస్తుత సదస్సు ద్వారా తిరిగి ధార్మిక కార్యక్రమాలను వేగవంతం చేస్తారని వెల్లడించారు.
చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ పూర్వయుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం లభించేదని, కలియుగంలో నామసంకీర్తన చేస్తే చాలు భగవంతుని కృప తప్పక కలుగుతుందని పేర్కొన్నారు. భగవన్నామస్మరణతో భక్తులు తమ కష్టాలను దూరం చేసుకుని, ముక్తి మార్గం వైపు పయనించవచ్చని సూచించారు. తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు.
ధార్మిక సదస్సులో స్వామీజీలు అందించే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని సనాతన హైంధవ ధర్మం పరిఢవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సదస్సులో ఈవో ఏవి.ధర్మారెడ్డి, టీటీడీ జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.