అమరావతి : మార్కాపురం జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్య (Murder )కు గురైన ఘటన సంచలనం కలిగిస్తుంది. కుమార్తెతో సన్నిహితంగా ఉండడాన్ని భరించలేక ఆమె తల్లిదండ్రులు ( Parents ) యువకుడిని దారుణంగా చంపి వేశారు. ఈనెల 13న యర్రగొండపాలెంకు చెందిన ఆంజనేయులు అనే యువకుడు అదృశ్యమయ్యాడు.
యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా యువతి తల్లిదండ్రులు వెంకట నారాయణ, రమణ దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా ఆంజనేయులును చంపినట్లు గుర్తించారు. యువకుడిని చంపి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి బోరు బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించారు. దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.