అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో రోడ్డు ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా బస్సును వెనక్కి తీస్తుండగా ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టాడు. అదృష్టవశాత్తు విద్యుత్ నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా… అందరూ సురక్షితంగా బయటపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.