తిరుపతి: తిరుపతిలో (Tirupati incident ) నిన్న క్యూలైన్లో తొక్కిసలాట జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఏపీ మంత్రులు పరామర్శించారు. మంత్రులు హోం మంత్రి వంగలపూడి అనిత (Minister Anita) , ఆనం రాంనారాయణరెడ్డి( Ram Narayana Reddy) , అనగాని , పార్థసారథి (Parthasarathi)బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో
తిరుపతి: తిరుపతిలో నిన్న క్యూలైన్లో తొక్కిసలాట జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shymala rao) పరామర్శించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్సపొందుతున్న వారి వద్దకు వెళ్లి కారణాలను అడిగి తెలుసుకున్నారు.
తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం 41 మందికి గాయాలపాలు కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా తేలిందని వెల్లడించారు. పూర్తి విచారణ తరువాత అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.