అమరావతి : నాయకుల వ్యవహారం వల్ల పార్టీకి కలిగే నష్టాన్ని వివరించినందుకు ఆగ్రహించిన మంత్రి బాలినేని అనుచరులు ఒంగోలుకు చెందిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాను వెంటాడి దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పట్టణంలో సంచలనం కలిగించింది. సుబ్బారావు ఇంటిపై దాడి చేయడంతో లాడ్జిలో తల దాచుకోగా విషయం తెలుసుకుని మంత్రి అనుచరుడు సుబాని మరో 20 మంది అనుచరులు లాడ్జికి వెళ్లి అతడిపై చేయిచేసుకున్నారు. వాస్తవ విషయాలు తెలియజేస్తానని, తనను కొట్టవద్దని బతిమిలాడినా కనికరించకుండా పలుమార్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో మంత్రి బాలినేనితో సహ పలువురు తీవ్రంగా ఖండించారు.
గుప్తాపై దాడి జరుగుతుందని తెలిసి మా వాళ్లను ఆగమని చెప్పా.. ఆవేశంతో చేయి చేసుకున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నానని, దాడులు చేయడం మా సంస్కృతి కాదని మంత్రి పేర్కొన్నారు. కాగా టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్ స్పందిస్తు దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కార్యకర్తలకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటీ అని ప్రశ్నించారు. మరోవైపు ఈ దాడిన ఏపీ ఆర్యవైశ్య సంఘం నాయకులు ఖండించారు. నిందితులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేశారు.