Kandula Durgesh | ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధంపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయన్ని మంత్రి సందర్శించారు. తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా పనిచేయాలని మేం భావిస్తున్నప్పుడు, అధికారులు తూట్లు పొడిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో గత ప్రభుత్వం అవినీతి చేసిందని కందుల దుర్గేశ్ ఆరోపిపంచారు. గత ప్రభుత్వ అవినీతి మరకలు చేరిపేసే ప్రయత్నమిది అని మండిపడ్డారు. దహనమైన వాటిని జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై రాజమండ్రి ఆర్డీవో శివజ్యోతిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని జేసీ చెన్నరాయుడికి సూచించారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.