వైసీపీకి ఓటేయకపోతే ప్రజలకు పాపం.. వారిని ఆ దేవుడే చూసుకుంటాడు: బొత్స వ్యాఖ్యలు
చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ ప్లీనరీలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఓటేయాలని అడగడానికి బదులుగా.. తమ పార్టీకి ఓటేయకుంటే ప్రజలకు పాపం అంటుకుంటుందని, అలాంటి వారి సంగతి ఆ దేవుడే...
విజయనగరం: చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ ప్లీనరీలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఓటేయాలని అడగడానికి బదులుగా.. తమ పార్టీకి ఓటేయకుంటే ప్రజలకు పాపం అంటుకుంటుందని, అలాంటి వారి సంగతి ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పి ప్రజలను దూషించారు. తాను మంత్రిగా గత ప్రభుత్వాల్లో పనిచేశానని, ఈ ప్రభుత్వం అంత మంచిది చూడలేదని కితాబిచ్చారు.
గ్రామ, మండల స్థాయిలో పార్టీ నేతల మధ్య విభేదాలున్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స అంగీకరించారు. ఈ విభేదాలను తొలగించి పార్టీ కోసం సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, ఐక్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు, స్థానిక నాయకత్వానికి సూచించారు. మన ప్రభుత్వం చేసే మంచి పనులే మనల్ని మరోసారి విజేతగా నిలుపుతాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తాను గతంలో మూడు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశానని, అయితే ఈ ప్రభుత్వమే ది బెస్ట్ అని ప్రశంసించారు.
సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందుతున్నందున ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని బొత్స చెప్పారు. 1998 డీఎస్సీ కింద నియమితులయ్యే వారి సామర్థ్యం, నైపుణ్యాలపై విద్యా మంత్రి సందేహాలు లేవనెత్తారు. ఎంపికైన అభ్యర్థుల గురించి, వారి సేవలను ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు. ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండలేరని, విధి, కాలమే ఎవరినైనా నాయకుడిని చేస్తుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సహోద్యోగులతో, ప్రజలతో సక్రమంగా ప్రవర్తించాలని బొత్స సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

