అమరావతి : నెల్లూరు, కడప జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున కంపించిన భూమితో ఇళ్లలోని సామగ్రి కిందపడటం, మంచాలు కదలడంతో ఇళ్లలోని వారంతా బిక్కుబిక్కుమంటూ బయటకు పరుగులు తీశారు.
కడప జిల్లా బద్వేలు మండలంలోనూ భూమి కంపించిందని విద్యానగర్, చిన్నకేశంపల్లి గ్రామస్థులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఐదు సెకన్లపాటు భూమి కంపించిందని తెలిపారు.