అమరావతి : తమిళనాడు(Tamil Nadu) సుస్థిరాభివృద్ధికి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) గొప్ప పునాది వేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan ) పేర్కొన్నారు. అన్నాడీఎంకే పార్టీ ఆవిర్భావ దిన్సోతవం సందర్భంగా ట్విట్టర్(Twitter) వేదిక ద్వారా జనసేన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీఆర్ (MGR)పార్టీని స్థాపించి పేదలు, అన్నార్థులకు సాయం చేశారని, ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు.
ప్రజల అవసరాలను గుర్తించడంతో పాటు భావితరాల బాగు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడంలో ఎంజీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నానని అన్నారు. ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత విజయవంతంగా కొనసాగించారని తెలిపారు.
తమిళనాడు ప్రజలకు సేవ చేయడం, ఎంజీఆర్ ఆశయాలను నెరవేర్చడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం , రాష్ట్రాన్ని అభివృద్ధి , సంక్షేమంలో ఉన్నత శిఖరాల వైపు పార్టీని నడిపించాలని కోరారు. తమిళ భాష, సంస్కృతి పట్ల నాకున్న గౌరవం, తమిళుల అలుపెరగని పోరాట పటిమంటే నాకు ఎప్పటినుంచో గౌరవమని అన్నారు.