Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడికి గాయాలైన ఘటనపై పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ప్రస్తుతం మార్క్ బాగానే ఉన్నాడని, అతడి కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు.
కాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. అతని చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ దవాఖానలో అతను చికిత్స పొందుతున్నాడు.
విషయం తెలియగానే పవన్ కళ్యాణ్.. సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. డుంబ్రిగుడ మండలం కురిడిలో ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమయ్యారు.