Pawan Kalyan | సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మెగా బ్రదర్ నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తమ్ముడి గొప్పదనాన్ని కవితాత్మకంగా వివరించారు.
‘ నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే.. చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని.. నీతో నడవని వాళ్ల కోసం కూడా ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే.. వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని రైతు కంటిని తడపకుండా పంటనే తడపుతుందని.. అప్పట్నుంచి అడగటం మానేసి.. ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్థం చేసుకోవడం మొదలెట్టాను’ అని నాగబాబు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.
సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుందని.. కూటమి రాబోతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. సిరా పూసిన సామాన్యుడి వేలి సంతకంతో.. నీ గెలుపు సిద్ధమయ్యిందని పేర్కొన్నారు.
నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే ‘చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని…
నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే ‘వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని ‘రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని….
అప్పట్నుంచి… pic.twitter.com/uqjCAkEKXe
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 12, 2024