అమరావతి : రాష్ట్రంలో గిరిజన గర్బిణిలు (Tribal women) ఇబ్బందులు పడకుండా వసతి గృహాలను ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తెలిపారు. మంగళవారం అమరావతిలోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. టీడీపీ (TDP) హయాంలో చేపట్టిన గిరజన పథకాలను వైఎస్ జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యం చేశారని మండిపడ్డారు .
ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి(Ambedkar Overseas), బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకాలను పట్టించుకోలేదని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని, ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్‌లను తిరిగి ప్రవేశ పెట్టాలని సూచించారు.