అమరావతి : ఏపీలో భారీగా ఐఏఎస్ (IAS Officers) అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్. శ్రీదత్(Sridatt) ను నియమిస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ, కమిషనర్‌గా ఎం.వి శేషగిరి, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ (Handlooms and Textiles) శాఖ కమిషనర్‌గా రేఖారాణి(Rekharani) , ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌ను నియమించారు.
నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా హరికిరణ్‌కు అదనపు బాధ్యతలు , సెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా మల్లికార్జునను నియమించడంతో పాటు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సాంఘిక, సంక్షేమశాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేశ్, భూసర్వే, సెటిల్మెంట్ల డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా గిరీష్ షా, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీగా మంజీర్ జిలానీ నియమిస్తూ శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికా శుక్లాను నియమిస్తూ బోర్డు ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీగా రవి సుభాష్‌ను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా సంపత్‌కుమార్, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా దినేష్‌కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నారపు రెడ్డి మౌర్య, కడప మున్సిపల్ కమిషనర్‌గా ఎన్. తేజ్ భరత్‌ను నియమించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా కేతన్ గార్గ్, పల్నాడు జిల్లా జేసీగా సూరజ్ ధనుంజయ్, గుంటూరు జిల్లా జేసీగా అమిలినేని భార్గవతేజ ,తూర్పుగోదావరి జిల్లా జేసీగా హిమాన్షు కోహ్లి, కోనసీమ జిల్లా జేసీగా శాంతి, కాకినాడ జిల్లా జేసీగా గోవిందరావును నియమించారు.